Telugu Samethalu/ తెలుగు సామెతలు అక్షరం - అ
41 | అర్థబలం కంటే, అంగబలం ఎక్కువ |
42 | అనగా అనగా రాగం తినగా తినగా రోగం |
43 | అన్నీ ఉన్నాయి, అంచుకు తొగరే లేదు |
44 | అరచేత్తో సూర్యుని కిరణాలు ఆపలేవు |
45 | అయిన పెండ్లికి మేళమా? |
46 | అర్థరాత్రి మద్దెల దరువు |
47 | అసలు కంటే వడ్డీ మిన్న |
48 | అసలుకే ఎసరు పెట్టినట్లు |
49 | అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో |
50 | అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే |
51 | అరిచే కుక్క కరవదు |
52 | అబద్ధము ఆడితే అతికినట్లుండాలి |
53 | అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ |
54 | అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? |
55 | అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ |