Telugu Samethalu/ తెలుగు సామెతలు అక్షరం - అ
1 | అభ్యాసం కూసు విద్య |
2 | అడుసు తొక్కనేల కాలు కడగనేల |
3 | అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు |
4 | అడగందే అమ్మ అయినా పెట్టదు |
5 | అతి వినయం ధూర్త లక్షణం |
6 | అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట |
7 | అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు |
8 | అనువు గాని చోట అధికులమనరాదు |
9 | అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు. |
10 | అటునుండి నరుక్కు రా |
11 | అడిగేవాడికి చెప్పేవాడు లోకువ |
12 | అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు |
13 | అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు |
14 | ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం |
15 | అగ్నికి వాయువు తోడైనట్లు |
16 | అతగాడే ఉంటే మంగలెందుకు |
17 | అక్క మనదైతే బావ మనవాడా? |
18 | అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు |
19 | అత్త సొమ్ము అల్లుడు దానం |
20 | అడకత్తెరలో పోకచెక్క |
21 | అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు |
22 | అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు |
23 | అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు |
24 | అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే |
25 | అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు |
26 | అనుమానం పెనుభూతం |
27 | అన్నీ సాగితే రోగమంత భోగం లేదు |
28 | అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది |
29 | అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననివ్వదు |
30 | అద్దం అబద్ధం చెప్పదు |
31 | అయోమయం జగన్నాథం |
32 | అప్పిచ్చువాడు వైద్యుడు |
33 | అప్పుచేసి పప్పు కూడు |
34 | అధికమైతే అమృతం కూడా విషమే |
35 | అర చేతిలో బెల్లం పెట్టి మోచెయ్యి నాకించినట్టు |
36 | అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు |
37 | అరకాసు పనికి ముప్పాతిక బాడిగ |
38 | అన్నదానం కన్నా విద్యాదానం మిన్న |
39 | అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట |
40 | అమ్మబోతె అడవి కొనబోతె కొరివి |