Telugu Sandhulu / తెలుగు సంధుల
సంస్కృత సంధులు
1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును. 2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను. 3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును. 4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను. 5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును 6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును. 7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును |