Telugu Language History / తెలుగు భాష, లిపి చరిత్ర

సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవ భాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు!!

-- మిరియాల రామకృష్ణ 

సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగు. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడం భాషలకు 2008లో “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించింది.
ఆంధ్రప్రదేశ్ తరవాత తెలుగువాళ్లు ఎక్కువగా యానాం (పుదుచ్చేరి), తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. తెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎనిమిదన్నర కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీ, బెంగాలీల తరవాత) మూడో స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచింది.

తెలుగు భాష చరిత్ర
తెలుగు ద్రావిడ భాష. ద్రావిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, గోండీ మొదలైన 85 భాషలుండగా, అత్యధికంగా మాట్లాడుతున్న ద్రావిడభాష తెలుగే. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీ, తెలుగుకు మాతృక సంస్కృతమేననీ జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నది. కానీ సంస్కృతం, హిందీ, బెంగాలీ మొదలైన ఉత్తర భారతదేశ భాషలు “ఇండో-ఆర్యన్” భాషావర్గానికి చెందినవి కాగా, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలనీ భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగుతో పాటు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ద్రావిడభాషలన్నీ ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడి, వేరువేరుగా స్థిరపడ్డాయని పరిశోధకుల అంచనా.
తెలుగు అనే పదం ఎలా ఏర్పడిందనే విషయంపై మనకు విభిన్న వాదనలు వినిపిస్తాయి. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారనీ, త్రిలింగ పదం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది. కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు.

Page 1 2 3
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

తెలుగు వ్యాకరణం

తెలుగు అక్షరమాల
గుణింతములు
తెలుగు వత్తులు
ఛందస్సు
అలంకారాలు
సంధులు
సమాసాలు
భాషాబాగాలు
విభక్తులు
ప్రకృతి - వికృతులు
లింగములు
ద్విత్వ అక్షరాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు

తెలుసుకోవలసిన విషయాలు

తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
అంకగణితము
కాలమానం
ఉపనిషత్తులు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు వారాలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు పక్షాలు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
పదసంపద

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel