Telugu Language History / తెలుగు భాష, లిపి చరిత్ర

తమిళం, గోండీ భాషల్లో తెలు, తెలి అంటే తెలుపు లేదా చక్కదనం, “0గ” అనేది బహువచన సూచకం. ఆవిధంగా చక్కనివారు, తెల్లనివారు అనే అర్ధంలో తెలింగ, తెలుంగ అనే పదాలు ఉద్భవించాయని మరో వాదన. తమిళనాడులోనూ, కేరళంలోనూ ఇప్పటికీ తెలుగును “తెలుంగు” అనే పిలవడం మనం గమనించవచ్చు.
భాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన “గాధాసప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినది. తెలుగు భాష చరిత్ర క్రీ.శ. పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది.

తెలుగు లిపి
తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించింది. అశోకుని మౌర్య సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు. దక్షిణ భారత భాషలన్నీ మూలద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచే పుట్టాయి. మౌర్యుల బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్తూపంలోని శాసనాల్లో లభించాయి. ఈ భట్టిప్రోలు లిపి నుంచే దక్షిణ భారతదేశ లిపులన్నీ పరిణామం చెందాయి. చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు తెలుగు, కన్నడ దేశాలను కలిపి పాలించడం వల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామం చెందింది. క్రీ.శ. ఐదో శతాబ్దం నాటికి ఈ భట్టిప్రోలు లిపి నుంచి పాత తెలుగు లిపి ఆవిర్భవించిందని పరిశోధకుల అంచనా.
ప్రాచీన తెలుగు లిపిలో ఖ, ఘ, ఛ, ఝ, థ, ఠ మొదలైన మహాప్రాణ అక్షరాలు లేవనీ, ఈ శబ్దాలు ఇండో-ఆర్యన్ భాషల ప్రజలు మాత్రం విరివిగా వాడేవారనీ, ద్రావిడ భాషల ప్రజలు ఈ శబ్దాలను సాధారణ వ్యవహారిక భాషలో అసలు వాడేవారు కాదనీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇప్పటికీ మన పల్లెల్లో ఈ మహాప్రాణ అక్షరాలను చాలామంది రోజువారీ పలుకుబడి భాషలో వాడకపోవడం మనం గమనించవచ్చు. నన్నయ కాలంలో సంస్కృత సాహిత్యం విరివిగా తెలుగులోకి అనువాదం అయినప్పుడు, ఈ సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో రాయడం కోసం ప్రత్యేకంగా తెలుగు లిపిలో అక్షరాలను రూపొందించారు.

తెలుగు అక్షరాలు (37)
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ, సున్నా
క గ చ జ ట డ ణ త ద న ప ఫ బ మ య ర ల వ శ ష స హ ళ ఱ
సంస్కృత శబ్దాలను తెలుగులో రాయడం కోసం రూపొందించిన అక్షరాలు (19)
ఌ ఌ ఋ ౠ అః (విసర్గ)
ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ థ ధ భ క్ష రుత్వం, రుత్వం దీర్ఘం

Page 1 2 3
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

తెలుగు వ్యాకరణం

తెలుగు అక్షరమాల
గుణింతములు
తెలుగు వత్తులు
ఛందస్సు
అలంకారాలు
సంధులు
సమాసాలు
భాషాబాగాలు
విభక్తులు
ప్రకృతి - వికృతులు
లింగములు
ద్విత్వ అక్షరాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు

తెలుసుకోవలసిన విషయాలు

తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
అంకగణితము
కాలమానం
ఉపనిషత్తులు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు వారాలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు పక్షాలు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
పదసంపద

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel