Telugu Alankaralu / అలంకారములు

అలంకారములు రెండు రకాలు అవి
ఎ.శబ్దాలంకారములు
బి.అర్ధాలంకారముల

ఎ.శబ్దాలంకారములు -

1.వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.
ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి.
2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును.
ఉదా - పాప హరుహరు సేవించెదను.
3.లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.
ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
4. యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును.
ఉదా - లేమ దనుజులగెలువగా లేమా
5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట.


బి.అర్ధాలంకారములు -

1.ఉపమాలంకారము - ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును.
2.ఉత్ప్రేక్షాలంకారము - ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు.
ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.
3.రూపకాలంకారము - ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు.
ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము
4.శ్లేషాలంకారము - అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము.
ఉదా - రాజు కవలయానందకరుడు.
5.అర్ధాంతరన్యాసము - సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.
ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.
6.అతిశయోక్తి - ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట.
ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.
7.దృష్టాంతము - ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట.
ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు.
8.స్వభావోక్తి - జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట.
ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి

తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

తెలుగు వ్యాకరణం

తెలుగు అక్షరమాల
గుణింతములు
తెలుగు వత్తులు
ఛందస్సు
అలంకారాలు
సంధులు
సమాసాలు
భాషాబాగాలు
విభక్తులు
ప్రకృతి - వికృతులు
లింగములు
ద్విత్వ అక్షరాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు

తెలుసుకోవలసిన విషయాలు

తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
అంకగణితము
కాలమానం
ఉపనిషత్తులు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు వారాలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు పక్షాలు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
పదసంపద

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel