Telugu Sandhulu / తెలుగు సంధుల

తెలుగు సంధుల

1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము.
ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య
2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము
ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి
3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.
ఉదా - రాముడు + అతడు = రాముడతడు
4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.
5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.
ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట
6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.
ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.
7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.
ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె
8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.
ఉదా - సరసము + మాట = సరసపుమాట
9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.
ఉదా - పేద + ఆలు = పేదరాలు
10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.
ఉదా - భయము + పడు = భయపడు
11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.
ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు
12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.
ఉదా - చేయి + అతడు = చేయునతడు
13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును
ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు
14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.
ఉదా - ఏమి + ఏమి = ఏమేమి
15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.
ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు
16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.
ఉదా - పొలము + లు = పొలాలు.
17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.
ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు
18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును
ఉదా - అలరు + మేను = అలరు జొడి
19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.
ఉదా - నా + అది = నాది
20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.
ఉదా - నీ + చూపు = నీదు చూపు
21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు.
ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు

Page 1 2
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

తెలుగు వ్యాకరణం

తెలుగు అక్షరమాల
గుణింతములు
తెలుగు వత్తులు
ఛందస్సు
అలంకారాలు
సంధులు
సమాసాలు
భాషాబాగాలు
విభక్తులు
ప్రకృతి - వికృతులు
లింగములు
ద్విత్వ అక్షరాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు

తెలుసుకోవలసిన విషయాలు

తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
అంకగణితము
కాలమానం
ఉపనిషత్తులు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు వారాలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు పక్షాలు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
పదసంపద

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel