Telugu Kavithalu / తెలుగు కవితలు

Andhamayina Ontarithanam / అందమైన ఒంటరితనం


ఒంటరితనం తప్ప
ఎవరు నీవారు ?
ఈ చీకటి దుఃఖాల సుడులమధ్య
నిబ్బరాన్ని ఇంకెంతకాలం నటిస్తావ్ ?
లోపలి నదుల్ని
బయటకి ప్రవహించనీయక పోతే
నిన్నే నిలువునా ముంచేయవూ!

నలుగురు కాకపోయినా
ఒక్కరినైనా మిగుల్చుకోవాలి కదా!

అది మాత్రం
డబ్బు సంపాదించినట్లు కాదు
అసలు నీకేం కావాలో తెల్సా ?
పరుగు ఆపి క్షణం ఆలోచించు
లోపలి ప్రవాహం ఇంకే లోపు!

తెలుగు కవితలు

తల్లి ప్రేమ
కదిలిపొయే కెరటంలా...
నీవెవరు ?
ప్రయాణం
కరిగిపొయిన కాలంలా
ఓ జ్ఞాపకమా - నా ప్రేమ
అందమైన ఒంటరితనం
 

తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel