Telugu Laalipatalu - Uyyala Jampala / ఉయ్యాల జంపాల

ఉయ్యాల జంపాల లూగరావమ్మా
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||

కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ||

శుభశుక్రవారమున సుదతులు వూచ
సూరిజనము పొగడ సుందరముగాను
కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను
కావేటీ రంగనితో కలసినీవూగ ||ఉ||

శ్రీ వల్లిపుత్తూరిలో వెలసితివి తల్లీ
శ్రీరంగధాముని చేపట్టితివమ్మా
చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి
చేతనులను రక్షించ చెలులందరు ఊచ ||ఉ||

Telugu Laalipatalu / లాలి పాటలు

చందమామ రావె
ఉయ్యాల జంపాల
ముద్దుగారే యశోదకు
జో అచ్యుతానంద
తారంగం తారంగం
రామా లాలీ
 
 

తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel