Telugu Laalipatalu - Mudhhugaare Yashodhaku / ముద్దుగారే యశోదకు

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||

అంత నింత గొల్లెతల అరచేత మాణికము

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ

చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము

మితి గోవర్ధనపు గోమేధికము

సతమై శంఖు చక్రాల సందుల వైడూర్యము

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దుగారే||

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము

యేలేటి శ్రీ వెంకటాద్రి యింద్రనీలము

పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము

బాలునివలె దిరిగీ బద్మనాభుడు ||ముద్దుగారే||

Telugu Laalipatalu / లాలి పాటలు

చందమామ రావె
ఉయ్యాల జంపాల
ముద్దుగారే యశోదకు
జో అచ్యుతానంద
తారంగం తారంగం
రామా లాలీ
 
 

తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel