Sumathi satakam
సుమతీ శతకం
1 |
అక్కరకురాని చుట్టము, మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా నెక్కిన బాఱని గుఱ్ఱము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ. |
భావం -అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము,ఎంత ప్రార్దించినా వరమియ్యని దేవతా,మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను. |
|
2 |
అప్పిచ్చువాడు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ. |
భావం -అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము. |
|
3 |
శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ. |
భావం - మంచిబుద్ది కలవాడా ! శ్రీరాముని కరుణ చేత,ప్రజలందరూ మెచ్చునట్లు అందరికీ హితమయున నీతులు చెప్పుము. |
|
4 |
కులములోన నొకడు గుణవంతుడండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. |
భావం - అడవిలో గంధపు చెట్లు ఉన్నచో ఆ అడవి మొత్తం సువాసనలు వెదజల్లును.అలాగే ఒక వంశంలో గుణవంతుడు ఉంటే ఆ వంశము అంతటికీ కీర్తి వచ్చును. |
|
5 |
కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ. |
భావం -
బంగారపు సిమ్హసనములో మంచి ముహూర్త బలమున కుక్కను తీసుకు వచ్చి కూర్చోపెట్టినా దాని గుణము ఎలా మార్చుకోదో అధేవిధంగా అల్పుడుకు ఎంత గౌరవము ఇచ్చినా సరే తన నీచత్వమును వదలడు. |
|
6 |
ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్ తెప్పలుగ జెఱువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ. |
భావం- చరువులో నిండా నీరు చేరినపుడు వేల కొలది కప్పలు ఎలా అయితే చేరునో అలాగే సంపద కలిగినపుడు భందువులు కూడా అలానే చేరును. |
|
7 |
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా; నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ. |
భావం- తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు. |
|
8 |
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. |
భావం- ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి,దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు. |
|
9 |
కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ. |
భావం- ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును. |
|
10 |
అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ |
భావం- ఎంత అడిగినా జీతము ఇవ్వని యజమానిని సేవించి కష్టపడుట కంటే మంచి యెద్దులను కట్టి పొలమి దున్నుకొని బతకడం మంచిది. |