Bhartrihari Subhashitalu
భర్తృహరి సుభాషితాలు
1 |
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు |
భావం - ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును. ఎండమావిలో నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు |
|
2 |
తరువు లతిరసఫలభార గురుత గాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము...! |
భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం. |